PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 08 November 2026, 12:05 pm Posted by : Praja Sankshemam News

ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు

ప్రజాసంక్షేమం న్యూస్ నకిరేకల్:</strong నకిరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం గారి నివాసంలో దీపావళి పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారి కుటుంబ సభ్యులు పరస్పరం దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, హారతి కార్యక్రమం నిర్వహించి పండుగ సంబరాల్లో పాల్గొన్నారు.అనంతరం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం గారు నియోజకవర్గ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలగాలని కోరుకున్నారు.ఈ వేడుకల్లో ఎమ్మెల్యే గారి కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొన్నారు.

Copyright © 2026 PRAJA SANKSHEMAM NEWS. All rights reserved.