ఎస్టీలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు.. చైర్మన్గా లంబాడా సోదరుడిని నియమిస్తాం
20 ఎకరాల్లో సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయం నిర్మిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి మద్దిమడుగు, నవంబర్ 26, ప్రజా సంక్షేమం న్యూస్: గిరిజనుల హక్కులు, అభ్యున్నతి, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎస్టీల కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తామని, ఆ కమిషన్ చైర్మన్గా లంబాడా సోదరుడిని నియమిస్తామని ప్రకటించారు. లంబాడా సమాజానికి రాజకీయంగా రావాల్సిన అవకాశాలు, కోటాను సాధించేందుకు ఢిల్లీకి వెళ్లి పోరాడతామని హామీ ఇచ్చారు.నాగర్కర్నూల్ జిల్లా మద్దిమడుగులో...