ఏఐకేఎస్ జాతీయ మహాసభల విజయంతో రైతాంగ ఉద్యమానికి కొత్త ఊపు!

రైతులు, ప్రజలు పోరాటాలకు సిద్ధంగా ఉన్నారనే విశ్వాసం పెరిగింది.. మీడియా,వాలంటీర్లు,ప్రజలు,అధికార యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపిన జూలకంటి రంగారెడ్డి. ప్రజాసంక్షేమం న్యూస్|నల్లగొండ|నవంబర్ 21:నల్లగొండలో నిర్వహించిన అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 36వ జాతీయ మహాసభలు చారిత్రాత్మక విజయాన్ని సాధించాయని, ఈ విజయంతో రైతాంగ ఉద్యమానికి కొత్త ఊపు, కార్యకర్తల్లో నూతన ఉత్తేజం వచ్చిందని మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. రైతులు, ప్రజలు తమ వెంట బలంగా ఉన్నారనే విశ్వాసం పెరిగిందని, భవిష్యత్తులో రైతాంగ, ప్రజా సమస్యలపై మరింత...