కన్నీటి కుటుంబానికి యువశక్తి భరోసా.. ఆపదలో నేనున్నామంటూ రూ.10 వేల ఆర్థిక సాయం!
కుటుంబ పెద్దను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబానికి మేమున్నామంటూ యువశక్తి యువజన సంఘం సభ్యులు అండగా నిలిచారు. చిట్యాల | ప్రజా సంక్షేమం న్యూస్: ఆపదలో ఉన్నవారికి ఆర్థికంగా చేయూతనివ్వడమే కాదు.. కష్టకాలంలో వారికి మనోధైర్యాన్ని కల్పిస్తూ మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డుకు చెందిన మీసాల కిషన్ (52) ఆకస్మికంగా మృతి చెందడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ విషయం తెలుసుకున్న యువశక్తి యువజన సంఘం సభ్యులు వెంటనే స్పందించి, కిషన్ పార్థివదేహానికి...