కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా సాధించాలి: సీఎం
సుప్రీంకోర్టులో సమర్థంగా వాదనలు వినిపించాలి.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్:కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటాను సాధించేందుకు సుప్రీంకోర్టులో సమర్థవంతంగా వాదనలు వినిపించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో నీటిపారుదల శాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం పలు కీలక సూచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్తో ఉన్న జలవివాదాలకు సంబంధించిన అన్ని అంశాలపై అవసరమైన ఆధారాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ నెల 18వ తేదీ తర్వాత సుప్రీంకోర్టులో...