హైదరాబాద్, నవంబర్ 19 (ప్రజా సంక్షేమం న్యూస్):
85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ (IRC) వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి విచ్చేసిన కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారికి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఘనంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా రహదారుల మౌలిక సదుపాయాల అభివృద్ధి, జాతీయ రహదారుల విస్తరణ, రవాణా వ్యవస్థ బలోపేతం తదితర అంశాలపై 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ సమావేశంలో చర్చలు జరగనున్నాయి.