కోటి కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా.. ఇందిరమ్మ బీమాపై సీఎం కీలక ఆదేశాలు
అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీర అందించాలి – పంపిణీలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్:రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు.ఈ నెల 19న సిద్దిపేటలో నిర్వహించనున్న బహిరంగ సభలో ఇందిరమ్మ బీమా దరఖాస్తుల స్వీకరణతో పాటు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు....