PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 20 November 2026, 7:38 pm Posted by : Praja Sankshemam News

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు సహించేది లేదు.. పున్న కైలాష్ బహిరంగ క్షమాపణ చెప్పాలి:దైద రవీందర్

డీసీసీ అధ్యక్షుడి తీరుపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆగ్రహం..పదవికి రాజీనామా చేయాలని డిమాండ్
నకిరేకల్, నవంబర్ 20 (ప్రజా సంక్షేమం న్యూస్):

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఆయన వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కోమటిరెడ్డి బ్రదర్స్‌పై వ్యక్తిగత విమర్శలు చేయడం తగదని ఆయన హితవు పలికారు.శాసనమండలి మాజీ చైర్మన్ నేతి విద్యాసాగర్ నివాసంలో నిర్వహించిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో దైద రవీందర్ మాట్లాడారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై వ్యాఖ్యలు చేసే నైతిక హక్కు పున్న కైలాష్‌కు లేదని, పదవుల కోసం నాయకులపై విమర్శలు చేయడం మానుకోవాలని అన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ నల్గొండ జిల్లాలో ప్రత్యేక గుర్తింపు, ప్రజాదరణ కలిగిన నాయకులని, వారి రాజకీయ ప్రస్థానాన్ని, ప్రజాసేవను తక్కువ చేసి మాట్లాడటం సరికాదన్నారు.పార్టీ క్రమశిక్షణ గురించి మాట్లాడుతున్న డీసీసీ అధ్యక్షుడు ముందుగా తన కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటిస్తున్నారా అని ప్రశ్నించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫొటోలను కార్యక్రమాల్లో ఏర్పాటు చేస్తున్నారా లేదా అని నిలదీశారు. డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత క్షేత్రస్థాయిలో ఎంతవరకు పర్యటించారని, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను ఎంతవరకు కలుసుకున్నారని ప్రశ్నించారు. కొద్దిమందితో జిల్లా కేంద్రంలో ప్రెస్‌మీట్లు నిర్వహించడం వల్ల పార్టీ బలోపేతం కాదని, కార్యకర్తలను కలుపుకొని ముందుకు సాగాలని సూచించారు.డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగేందుకు పున్న కైలాష్‌కు నైతిక అర్హత లేదని, వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని దైద రవీందర్ డిమాండ్ చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌పై విమర్శలు చేస్తూ పదవుల కోసం ఆశపడటం తగదని ఘాటుగా వ్యాఖ్యానించారు.ఈ సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గార్లపాటి రవీందర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఛత్రపతి, బొల్లెపల్లి సర్పంచ్ వల్లపు శ్రీనివాస్ రెడ్డి, ఆరేగూడెం సర్పంచ్ నాగంపల్లి శ్యామ్, అన్నారం సర్పంచ్ సైదులు, ముక్కామల శేఖర్, మాజీ డీసీసీ కార్యదర్శి కోట పుల్లయ్య, మాజీ డీసీసీ ప్రధాన కార్యదర్శి మాద లింగస్వామి గౌడ్, కట్టంగూరు మాజీ పట్టణ అధ్యక్షుడు చెరుకు యాదగిరి, రంగు వీరయ్య, వెంకటేష్, చీకటి గూడెం గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీను, యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు బోస్, చెరుకు సైదులు, చెరుకు యాదయ్య, నాగరాజు, నవీన్, యాకోబు, చారి తదితరులు పాల్గొన్నారు.