ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్: హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నూతనంగా నియమితులైన ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి బి. సందీప్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC), సలహా కమిటీ సమావేశంలో పాల్గొన్నాను.ఈ సమావేశంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు శ్రీ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి శ్రీ సచిన్ సావంత్, సీడబ్ల్యూసీ సభ్యులు శ్రీ వంశీచంద్ రెడ్డి, శ్రీ దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ ఎన్నికల కమిటీ సభ్యుడు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితర సీనియర్ నాయకులు పాల్గొన్నారు.తెలంగాణలో పార్టీ సంస్థాగత బలోపేతం, రాజకీయ కార్యాచరణ, ప్రజా ప్రభుత్వ కార్యక్రమాలు, భవిష్యత్ వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించారు.