గిగ్,ప్లాట్‌ఫామ్ కార్మికులకు రూ.5 లక్షల జీవిత బీమా.. రూ.10 లక్షల ఆరోగ్య బీమా: సీఎం రేవంత్ రెడ్డి
నేటి నుంచే గిగ్ వర్కర్స్ సంక్షేమ చట్టం అమలు హైదరాబాద్, నవంబర్ 14 (ప్రజా సంక్షేమం న్యూస్):తెలంగాణ రాష్ట్రంలోని గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికుల సామాజిక భద్రత, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కలిసి గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్ల సంక్షేమ విధానాన్ని ఆవిష్కరించడంతో పాటు ఆన్లైన్ నమోదు ప్రక్రియను ప్రారంభించారు.దేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలోని జయభేరీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన...