గుండ్రాంపల్లి సింగిల్ విండో చైర్మన్గా బండ అంజయ్య ఎన్నిక
నూతన చైర్మన్, 13 మంది డైరెక్టర్లకు ఎమ్మెల్యే వేముల వీరేశం అభినందనలు నకిరేకల్, నవంబర్ 27 (ప్రజా సంక్షేమం న్యూస్): చిట్యాల మండలం గుండ్రాంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (సింగిల్ విండో PACS) చైర్మన్గా బండ అంజయ్య నూతనంగా ఎన్నికయ్యారు. ఆయనతో పాటు నూతనంగా ఎన్నికైన 13 మంది డైరెక్టర్లు ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను నకిరేకల్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం నూతన చైర్మన్ బండ అంజయ్యతో పాటు డైరెక్టర్లను శాలువాలతో సత్కరించి...