PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 10 November 2026, 12:06 pm Posted by : Praja Sankshemam News

చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ వేముల వీరేశం

ప్రజాసంక్షేమం న్యూస్ నార్కెట్‌పల్లి:మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన చెరువుగట్టు శ్రీ జడల రామలింగేశ్వర స్వామివారిని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నకిరేకల్ నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, రైతులకు పంటలు సమృద్ధిగా పండి పాడిపంటలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించారు.అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యే వేముల వీరేశం, వారి కుటుంబ సభ్యులకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు అందించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్, డైరెక్టర్లు, స్థానిక నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.