చేయూత పథకం కింద కొత్త పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీ

మునుగోడు,నవంబర్ 18(ప్రజాసంక్షేమం న్యూస్–మండల ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న చేయూత పథకం ద్వారా అర్హులైన వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా కొత్త పెన్షన్లు మంజూరు చేసింది.మునుగోడు మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నకరేకల్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాయకత్వంలో రత్తిపల్లి గ్రామానికి చెందిన నూతన పెన్షన్ లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు.గ్రామ సర్పంచ్ జిట్టగోని సైదమ్మ, సైదులు, పంచాయతీ కార్యదర్శి, మాజీ సర్పంచ్ మాధగోని రాజేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు...