తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించాలి: సీఎం రేవంత్ రెడ్డి
2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యం 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, నవంబర్ 19 (ప్రజా సంక్షేమం న్యూస్): తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాల సాధనలో దేశ ప్రగతికి తెలంగాణ తనవంతు సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే...