తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ వేగవంతం!
వెబ్‌సైట్‌ను త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కమిటీ నిర్ణయం ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని గుర్తింపు కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు మినిస్టర్ క్వార్టర్స్‌లోని నివాసంలో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశం నిర్వహించి, ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలు, పనుల పురోగతిపై సమీక్షించింది.కమిటీ చైర్మన్ కే. కేశవరావు,ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్,మోతే శోభన్ రెడ్డి, శ్యాం మోహన్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.వివిధ యూనివర్సిటీల ఉద్యమకారులు, కళాకారులు,సబ్బండ వర్గాల ప్రతినిధులతో...