తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని భావితరాలకు అందించాలి

నవంబర్ 29న రాష్ట్రవ్యాప్తంగా దీక్షా దివస్ నిర్వహించాలి: చిరుమర్తి లింగయ్య ప్రజాసంక్షేమం న్యూస్ నకిరేకల్:తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్ పట్టణ కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, ఆత్మాభిమానం, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షకు ప్రతీకగా నిలిచిన నవంబర్ 29వ తేదీని ప్రతి సంవత్సరం దీక్షా దివస్‌గా నిర్వహిస్తున్నామని తెలిపారు.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు,...