PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 27 November 2026, 6:46 pm Posted by : Praja Sankshemam News

తెలంగాణ విద్యుత్ రంగ బలోపేతానికి కేంద్రానికి కీలక ప్రతిపాదనలు

పంప్డ్ స్టోరేజ్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్, గ్రీన్ ఎనర్జీ కారిడార్‌కు సహకారం కోరిన తెలంగాణ
న్యూఢిల్లీ:
కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ అధ్యక్షతన న్యూఢిల్లీలో జరిగిన రాష్ట్ర విద్యుత్ మంత్రుల సమావేశంలో తెలంగాణ తరఫున పాల్గొని, రాష్ట్ర విద్యుత్ రంగ అభివృద్ధి, భవిష్యత్ అవసరాలకు సంబంధించి పలు కీలక ప్రతిపాదనలను కేంద్రం ముందుంచారు.తెలంగాణ విద్యుత్ రంగానికి సంబంధించి కేంద్రం నుంచి ఆర్థిక సహకారం, ప్రాజెక్టులకు అనుమతులు, గడువు పొడిగింపు, పునరుత్పాదక విద్యుత్ నిల్వ వ్యవస్థల అభివృద్ధికి మద్దతు కోరారు.
తెలంగాణ ప్రతిపాదించిన కీలక అంశాలు:
– రూ.25,096 కోట్ల RDSS నిధులు: ఆమోదాలను 60 రోజుల్లో జారీ చేయడంతో పాటు, పథకం గడువును మార్చి 2028 వరకు పొడిగించాలని కోరారు.
– పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు: ప్రతి మెగావాట్‌కు రూ.1 కోటి చొప్పున వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ (VGF) అందించాలని, కల్లూరు ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయాలని ప్రతిపాదించారు.
– బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్: 2,000 మెగావాట్ గంటల (MWh) బ్యాటరీ విద్యుత్ నిల్వ సామర్థ్యం అభివృద్ధికి కేంద్ర సహకారం కోరారు.
– HVDC కారిడార్: రాయగఢ్–పుగలూరు–త్రిస్సూర్ 6,000 మెగావాట్ల హై వోల్టేజ్ డైరెక్ట్ కరెంట్ (HVDC) కారిడార్‌కు జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించాలని కోరారు.
– గ్రీన్ ఎనర్జీ కారిడార్: 23,480 MVA సామర్థ్యంతో గ్రీన్ ఎనర్జీ కారిడార్ మొదటి దశ పనులకు ఆమోదం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
– ట్రాన్స్‌మిషన్ వ్యవస్థ: సెడం–పరిగి 400 కేవీ లైన్, మహేశ్వరం-II సబ్‌స్టేషన్‌కు జాతీయ స్థాయిలో వ్యయ భాగస్వామ్యం కల్పించాలని కోరారు.
– ట్రాన్స్‌మిషన్ ఛార్జీలు: అంతర్రాష్ట్ర విద్యుత్ ప్రసార ఛార్జీలను హేతుబద్ధీకరించాలని, పునరుత్పాదక విద్యుత్ ప్రసార ఛార్జీల మినహాయింపును మార్చి 2030 వరకు కొనసాగించాలని ప్రతిపాదించారు.
– గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి: ఫిబ్రవరి–ఏప్రిల్ 2027 మధ్య గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తికి హామీతో కూడిన గ్యాస్ సరఫరా, ఖర్చుల భాగస్వామ్యం కల్పించాలని కోరారు.
పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టే ప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందించేందుకు సానుకూలంగా స్పందించిన కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్‌కు తెలంగాణ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.రాష్ట్ర విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేస్తూ, పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చడంతో పాటు, స్థిరమైన ఇంధన భవిష్యత్తు నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.