తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి
సమ్మక్క–సారలమ్మ తోరణాల నమూనాలతో సాంస్కృతిక వైభవం.. విదేశీ ప్రతినిధులకు మెరుగైన సౌకర్యాలు ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్:తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు, సాంస్కృతిక వైభవం ప్రతిబింబించేలా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సమ్మిట్ ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం, ప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని స్పష్టం చేశారు.సమ్మిట్ ప్రాంగణంలో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా సమ్మక్క–సారలమ్మ ఆలయ తోరణాల నమూనాలతో అలంకరణలు చేపట్టాలని, రాష్ట్ర సంప్రదాయాలు, ప్రత్యేకతలు ప్రపంచ ప్రతినిధులకు పరిచయం అయ్యేలా...