తెల్దారుపల్లి వద్ద ఎన్నెస్పీ కాలువపై రూ.5 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం:మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

14, 15, 16వ వార్డుల్లో రూ.3.20 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన తెల్దారుపల్లి: ప్రజా సంక్షేమం న్యూస్: ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని తెల్దారుపల్లి గ్రామ ప్రజలు, రైతుల సౌకర్యార్థం ఎన్నెస్పీ కాలువపై రూ.5 కోట్లతో నూతన బ్రిడ్జి నిర్మించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. గ్రామానికి అవతలివైపు ఉన్న వ్యవసాయ భూములకు రైతులు సులభంగా వెళ్లేందుకు ఈ బ్రిడ్జి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.మంగళవారం తెల్దారుపల్లిలోని 14, 15, 16వ వార్డుల్లో రూ.3.20...