దళిత పారిశుద్ధ్య కార్మికురాలిపై దాడి చేసిన నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలి!

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలి కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున డిమాండ్ నల్లగొండ, నవంబర్ 19 (ప్రజా సంక్షేమం న్యూస్): నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 45వ డివిజన్‌లో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న దళిత మహిళ చందుపట్ల రమణ (45)పై దాడికి పాల్పడిన బాలకృష్ణను వెంటనే అరెస్టు చేయాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) నల్లగొండ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు. నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు...