ధర్మారెడ్డి పల్లి కాల్వలో తూములు ఏర్పాటు చేసి ఫీడర్ ఛానళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలి!

రామన్నపేట చెరువులకు సాగు, తాగునీరు అందించాలని ప్రజలు,రైతుల విజ్ఞప్తి ప్రజాసంక్షేమం న్యూస్ రామన్నపేట:ధర్మారెడ్డి పల్లి కాల్వ నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో రామన్నపేట పట్టణ ప్రజలు, రైతుల సాగు, తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని కాల్వలో తూములు ఏర్పాటు చేసి ఫీడర్ ఛానళ్ల నిర్మాణానికి నీటిపారుదల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు, రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.రామన్నపేట పట్టణంలోని వెంకటరామయ్య చిన్న చెరువును నింపేందుకు రైల్వే స్టేషన్ సమీపంలోని ధర్మారెడ్డి పల్లి కాల్వకు తూము ఏర్పాటు చేసి, ఎర్రగుంట, లోతుకుంట, చాకరికుంట మీదుగా ఫీడర్...