PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 02 November 2026, 5:13 pm Posted by : domalapallygopi@gmail.com

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి

రైతుల సమస్యలపై చర్చించడానికి నవంబర్ 15 నుండి 18 వరకు నల్లగొండలో నిర్వహిస్తున్న అఖిల భారత రైతు సంఘం జాతీయ మహాసభలను,15వ తేదీన జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయండి.
— వేముల బిక్షం, సీపీఎం ఆత్మకూర్ మండల కార్యదర్శి</strong ప్రజాసంక్షేమం న్యూస్:
జిల్లావ్యాప్తంగా సొసైటీ, ఐకేపీ సహకార సంఘాల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుండి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఎం మండల కార్యదర్శి వేముల బిక్షం డిమాండ్ చేశారు.ఆత్మకూర్ మండలం పుల్లయ్యగూడెం గ్రామంలోని వ్యవసాయ మార్కెట్ కేంద్రాన్ని సీపీఎం మండల కమిటీ పరిశీలించింది. గత 20-25 రోజులుగా రైతులు ధాన్యం తెచ్చి కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారని, వర్షాల వల్ల ధాన్యం తడిసిపోతున్న ఆందోళనకర పరిస్థితి నెలకొందని తెలిపారు.రైతుల పడుతున్న ఇబ్బందులు: గత పంట కాలంలోనూ ధాన్యం సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ నానా అవస్థలు పడ్డారని, ఒక్కో రైతు ధాన్యం నిల్వ కోసం సుమారు రూ. 10,000 పైగా ఖర్చు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే వరి ధాన్యం నిల్వకు పట్టాలు, మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.
నల్లగొండలో జాతీయ మహాసభలు: దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు, గిట్టుబాటు ధరలు, సబ్సిడీ విత్తనాల కోసం నవంబర్ 15 నుండి 18 వరకు నల్లగొండ జిల్లా కేంద్రంలో అఖిల భారత రైతు సంఘం జాతీయ 36వ మహాసభలు జరగనున్నాయి. ఇందులో భాగంగా నవంబర్ 15న నిర్వహించే భారీ బహిరంగ సభను రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు తుమ్మలగూడెం యాదయ్య, కూరెళ్ల నాగయ్య, సోమయ్య, బత్తిని లింగయ్య, తండా రమేష్, కె. నర్సిరెడ్డి, అడిగే సాలయ్య, బత్తిని నరసింహం, ఏపూరి కిష్టయ్య, తండా ఏకస్వామి, బత్తిని పుష్పమ్మ, తండా సుజాత, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Copyright © 2026 PRAJA SANKSHEMAM NEWS. All rights reserved.