నకిరేకల్‌లో ఇందిరమ్మ జీవిత బీమా పథకం ప్రారంభం
అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా భరోసా – ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రజాసంక్షేమం న్యూస్ నకిరేకల్:పేద,మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని నకిరేకల్ నియోజకవర్గంలో లాంఛనంగా ప్రారంభించారు. ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, సంబంధిత అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పథకాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ, కుటుంబ పెద్ద ప్రమాదవశాత్తు మరణించినప్పుడు ఆ కుటుంబం ఆర్థిక...