PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 15 November 2026, 6:17 pm Posted by : Praja Sankshemam News

నల్లగొండలో కదం తొక్కిన ఎర్రదండు.. భారీగా తరలివచ్చిన రైతులు!

నల్లగొండ, నవంబర్ 15, ప్రజా సంక్షేమం న్యూస్:నల్లగొండలో ఎర్రజెండాల రెపరెపల మధ్య రైతుల భారీ ర్యాలీ సందడి నెలకొంది. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో రైతులు, మహిళలు తరలివచ్చినట్లు దృశ్యాల్లోకనిపిస్తోంది.ఎటుచూసినా ఎర్రజెండాలు, రైతు సంఘం జెండాలతో ర్యాలీ ప్రాంగణం సందడిగా మారింది. భారీగా తరలివచ్చిన రైతులతో నల్లగొండలో ఎర్రదండు కదం తొక్కింది.