నల్లగొండలో భారీ చోరీల ముఠా గుట్టురట్టు ## ఎయిర్టెల్ టవర్లలో రేడియో రిమోట్ యూనిట్లే టార్గెట్.. తొమ్మిది మంది అరెస్ట్!
నవంబర్ 14, ప్రజా సంక్షేమం న్యూస్ – నల్లగొండ:పనిచేస్తున్న సంస్థకే కన్నం వేసిన ఇంజినీర్ల ముఠా గుట్టును నల్లగొండ జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఎయిర్టెల్ మొబైల్ టవర్లలో అమర్చిన ఖరీదైన రేడియో రిమోట్ యూనిట్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న తొమ్మిది మంది ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో అదే సంస్థలో పనిచేస్తున్న ముగ్గురు ఇంజినీర్లు ఉండటం గమనార్హం.సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆసరాగా చేసుకుని తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 38 చోరీలకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ చోరీల...