PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 14 November 2026, 8:16 am Posted by : Praja Sankshemam News

నల్లగొండలో హోంగార్డుల సంక్షేమానికి ఎస్పీ పెద్దపీట!

10 మంది హోంగార్డులకు రూ.3.43 లక్షల ఆర్థిక సాయం పంపిణీ
ప్రజాసంక్షేమం న్యూస్ నల్లగొండ:
హోంగార్డుల సంక్షేమానికి పోలీస్ శాఖ అండగా నిలుస్తోందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. విధి నిర్వహణలో సేవలందిస్తున్న హోంగార్డులు, వారి కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వివిధ రూపాల్లో ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా జిల్లాలోని 10 మంది హోంగార్డులకు మొత్తం రూ.3.43 లక్షల ఆర్థిక సాయాన్ని జిల్లా ఎస్పీ పంపిణీ చేశారు. ఇందులో భాగంగా వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సహాయం, విద్యార్థులకు మెరిట్ స్కాలర్‌షిప్‌లు, మరణించిన హోంగార్డుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించారు.అలాగే పదవీ విరమణ చేసిన హోంగార్డులకు రూ.2.60 లక్షల ప్రయోజనాలను అందజేస్తూ చెక్కులు పంపిణీ చేశారు. హోంగార్డులు, వారి కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎస్పీ భరోసా ఇచ్చారు.