నవంబర్ 19 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రారంభం: బట్టి విక్రమార్క
ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా.. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో అమలు కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్, నవంబర్ 14 (ప్రజా సంక్షేమం న్యూస్): రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియ నవంబర్ 19 నుంచి ప్రారంభం కానుంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ పథకాన్ని అధికారికంగా...