నవంబర్ 26న దేశవ్యాప్తంగా రైతు, కార్మిక సంఘాల నిరసనలు

ఎఫ్‌టీఏ ఒప్పందాలను రద్దు చేయాలి.. నాలుగు కార్మిక కోడ్‌లను ఉపసంహరించాలి పంటలన్నింటికీ సీ2+50 శాతం ప్రకారం చట్టబద్ధమైన కనీస మద్దతు ధర కల్పించాలి నల్గొండలో ప్రారంభమైన ఏఐకేఎస్ 36వ జాతీయ మహాసభలు నల్గొండ, నవంబర్ 16 (ప్రజాసంక్షేమం న్యూస్): రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం నవంబర్ 26న దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 36వ జాతీయ మహాసభలు పిలుపునిచ్చాయి. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను (ఎఫ్‌టీఏ) ఉపసంహరించుకోవాలని, కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) దోపిడీని...