ప్రజా సంక్షేమం న్యూస్-నకిరేకల్: </strongచిట్యాల మండలం నేరెడ గ్రామంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు దుబ్బాక నర్సింహారెడ్డి స్వగృహంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు.ఈ సందర్భంగా అయ్యప్ప స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. నకిరేకల్ నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని అయ్యప్ప స్వామిని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు దుబ్బాక నర్సింహారెడ్డి, దుబ్బాక అమరేందర్ రెడ్డి, గ్రామ సర్పంచ్, గ్రామస్తులు, అయ్యప్ప స్వాములు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.