చిట్యాల, నవంబర్ 16 (ప్రజా సంక్షేమం న్యూస్):
నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలోని శ్రీ రాజేశ్వరి ఫంక్షన్ హాల్‌లో ఎడ్ల శ్రీశైలం యాదవ్ – మంజుల దంపతుల కుమార్తెలు, కుమారుడి పట్టువస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకకు తెలంగాణ రాష్ట్ర మాజీ శాసనమండలి ఛైర్మన్ నేతి విద్యాసాగర్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ ముఖ్య అతిథులుగా హాజరై చిన్నారులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో చిన్న తుమ్మలగూడెం కాంగ్రెస్ పార్టీ గ్రామ సర్పంచ్ మహేష్ యాదవ్, చిట్యాల కాంగ్రెస్ నాయకులు జిగిని భిక్షం రెడ్డి, పావురాల మత్స్యగిరి యాదవ్, సోమనబోయిన శ్రీశైలం యాదవ్, ఎడ్ల మహాలింగం యాదవ్, పాలకుల పరమేశ్ యాదవ్, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.