పత్రికా విలేకరి మహబూబ్ సోదరుడి మృతదేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు
ప్రజాసంక్షేమం న్యూస్: పత్రికా విలేకరి మహబూబ్ గారి సోదరుడు గుండెపోటుతో మృతి చెందడంతో విషయం తెలుసుకున్న శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు గారు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ గారు వారి నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మృతుడి పార్థివదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ తంజీం, సీనియర్ నాయకులు నామా రవికిరణ్, శివకుమార్ స్వామి తదితరులు పాల్గొన్నారు.