పౌల్ట్రీ రంగానికి ప్రభుత్వం అండగా ఉంటుంది.. కొత్త పాలసీలు తీసుకొస్తాం

గ్రామ పంచాయతీల్లో పౌల్ట్రీ పరిశ్రమలకు సింగిల్ విండో అనుమతులు.. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, నవంబర్ 25 (ప్రజా సంక్షేమం న్యూస్): పౌల్ట్రీ పరిశ్రమను రాష్ట్రంలో ప్రాధాన్యత రంగంగా గుర్తించి, దాని అభివృద్ధికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు ప్రభుత్వం అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పౌల్ట్రీ రంగం ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా కొత్త పాలసీలు రూపొందిస్తామని, కాలానుగుణంగా క్షేత్రస్థాయి అవసరాలకు అనుగుణంగా వాటిని మెరుగుపరుస్తామని స్పష్టం చేశారు.హైదరాబాద్‌లో నిర్వహించిన పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో–2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని...