PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 13 November 2026, 1:08 pm Posted by : patilsrp86@gmail.com

ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టీఐ బోర్డులు ఏర్పాటు చేయాలి. – RTI యాక్టివిస్టిక్ సొసైటీ హత్నూర మండల్ ప్రెసిడెంట్ వేణు

సంగారెడ్డి, నవంబర్ 11 (రిపోర్టర్: ఖాజా): సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సమాచార హక్కు చట్టం (RTI Act-2005) అమలుకు చర్యలు తీసుకోవాలని భారతీయ పౌరుడు మన్నే వేణు జిల్లా విద్యాశాఖ అధికారిని కోరారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి (DEO)కు వినతిపత్రం అందజేశారు.ప్రతి ప్రభుత్వ పాఠశాలలో సమాచార హక్కు చట్టానికి సంబంధించిన బోర్డులు ఏర్పాటు చేయాలని, ప్రజా సమాచార అధికారి (PIO), మొదటి అప్పీల్ అధికారి వివరాలను పాఠశాలల్లో ప్రదర్శించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే సమాచార హక్కు దరఖాస్తు విధానం, దరఖాస్తు రుసుము, సమాధానం పొందే విధానం, అప్పీల్ చేసుకునే వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరారు. సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 4(1)(b) ప్రకారం ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన సమాచారాన్ని ప్రతి పాఠశాలలో ప్రదర్శించాలని సూచించారు.ప్రభుత్వ పాఠశాలల్లో పారదర్శకత పెంపొందించడంతో పాటు విద్యార్థులకు, తల్లిదండ్రులకు ప్రజాస్వామ్య హక్కులపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని మన్నే వేణు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఈ ఆదేశాలు జారీ చేసి, అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.