ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులపై మంత్రుల సమీక్ష,!

నిర్ణీత గడువులో నిర్మాణాలు పూర్తి చేయాలి – అధికారులకు ఆదేశాలు ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్:కరీంనగర్, జనగాం, సిద్ధిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, వాటి హాస్టళ్ల నిర్మాణ పనులతో పాటు వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి పొన్నం ప్రభాకర్ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయా నిర్మాణ పనుల ప్రస్తుత పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను వేగవంతం చేయడంతో పాటు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని...