PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 16 November 2026, 3:27 pm Posted by : Praja Sankshemam News

ప్రమాదంలో గాయపడిన వార్డు సభ్యుడు శంకరయ్యకు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి పరామర్శ

రామన్నపేట, నవంబర్ 16 (ప్రజా సంక్షేమం న్యూస్):
నకిరేకల్ నియోజకవర్గంలోని రామన్నపేట మండలం సిరిపురం గ్రామ వార్డు సభ్యుడు గాదె శంకరయ్య ప్రమాదవశాత్తు గాయపడి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలుసుకున్న నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆయనను పరామర్శించారు.ఈ సందర్భంగా శంకరయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయనకు మనోధైర్యం కల్పిస్తూ ఆరోగ్యంపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.