PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 21 November 2026, 10:26 pm Posted by : Praja Sankshemam News

బావిలో పడిన వ్యక్తిని కాపాడిన నల్గొండ టూ టౌన్ పోలీసులు

సమయస్ఫూర్తి..ఒక ప్రాణాన్ని నిలబెట్టింది
నల్గొండ, నవంబర్ 21 (ప్రజా సంక్షేమం న్యూస్): ప్రమాదవశాత్తు బావిలో పడిన వ్యక్తిని నల్గొండ టూ టౌన్ పోలీసులు చాకచక్యంగా, సాహసోపేతంగా రక్షించి ప్రాణాపాయం నుంచి బయటపడేశారు. పోలీసుల సమయస్ఫూర్తి, మానవత్వంతో కూడిన చర్యపై స్థానికులు ప్రశంసలు వ్యక్తం చేశారు.నల్గొండ పట్టణంలోని సతీష్ నగర్‌లో నివాసం ఉంటున్న 38 ఏళ్ల రాసమల్ల రంజిత్ కుమార్ ప్రమాదవశాత్తు ఇంటి వద్ద ఉన్న బావిలో పడిపోయాడు. సమాచారం అందుకున్న ఎస్సై సైదా బాబు పోలీసు సిబ్బందితో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తాడు సహాయంతో సమన్వయంగా, ధైర్యంగా పనిచేసి రంజిత్ కుమార్‌ను సురక్షితంగా బావి నుంచి బయటకు తీసుకొచ్చారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ ఎస్సై సైదా బాబుతో పాటు పోలీసు సిబ్బంది ఎం.ఏ. ఫరూక్, బాలకోటి స్వామి తక్షణ స్పందన, అంకితభావంతో చేసిన సహాయక చర్యలను ప్రత్యేకంగా అభినందించారు.ప్రజల ప్రాణాలను కాపాడటంలో నల్గొండ జిల్లా పోలీసుల నిబద్ధత, సేవాభావం మరోసారి చాటిచెప్పిన ఈ ఘటనపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
ప్రజల భద్రతే లక్ష్యం.. ఆపదలో అండగా పోలీసులు.