బావిలో పడిన వ్యక్తిని కాపాడిన నల్గొండ టూ టౌన్ పోలీసులు

సమయస్ఫూర్తి..ఒక ప్రాణాన్ని నిలబెట్టింది నల్గొండ, నవంబర్ 21 (ప్రజా సంక్షేమం న్యూస్): ప్రమాదవశాత్తు బావిలో పడిన వ్యక్తిని నల్గొండ టూ టౌన్ పోలీసులు చాకచక్యంగా, సాహసోపేతంగా రక్షించి ప్రాణాపాయం నుంచి బయటపడేశారు. పోలీసుల సమయస్ఫూర్తి, మానవత్వంతో కూడిన చర్యపై స్థానికులు ప్రశంసలు వ్యక్తం చేశారు.నల్గొండ పట్టణంలోని సతీష్ నగర్‌లో నివాసం ఉంటున్న 38 ఏళ్ల రాసమల్ల రంజిత్ కుమార్ ప్రమాదవశాత్తు ఇంటి వద్ద ఉన్న బావిలో పడిపోయాడు. సమాచారం అందుకున్న ఎస్సై సైదా బాబు పోలీసు సిబ్బందితో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక...