అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం
ప్రజా సంక్షేమం న్యూస్:ఏడాకులపల్లి గ్రామ సమీపంలో నక్కలగట్టుకు వెళ్లే మిషన్ భగీరథ వాటర్ పైప్‌లైన్‌కు లీకేజీ ఏర్పడటంతో గత రెండు రోజులుగా తాగునీరు వృథాగా పోతోంది. పెద్ద ఎత్తున నీరు వృథా అవుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విలువైన తాగునీరు వృథా కాకుండా వెంటనే స్పందించి పైప్‌లైన్ లీకేజీని మరమ్మతు చేయాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నీటి వృథాను అరికడతారా?