భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సీపీఎం నాయకులు
ప్రజాసంక్షేమం న్యూస్ రామన్నపేట: మండలంలోని నీర్నేముల గ్రామానికి చెందిన నాయి బ్రాహ్మణ సంఘం మాజీ జిల్లా నాయకులు రాచమల్ల భద్రయ్య అనారోగ్యంతో మృతి చెందడం పట్ల సీపీఎం నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ సర్పంచ్ బోయిన ఆనంద్, మాజీ ఎంపీపీ నాగటి ఉపేందర్ మాట్లాడుతూ.. రాచమల్ల భద్రయ్య మృతి నీర్నేముల గ్రామానికి, నాయి బ్రాహ్మణ సంఘానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో సీపీఎం గ్రామ శాఖ కార్యదర్శి నాగటి లక్ష్మణ్, పార్టీ సీనియర్ నాయకులు బండా జగన్మోహన్ రెడ్డి, నేమనంది లింగయ్య, మునుగోటి అత్తయ్య, వార్డు సభ్యులు నాగటి ఉపేందర్, మాజీ వార్డు సభ్యులు నాగటి మహేష్, పాల్వాయి చంద్రశేఖర్ రెడ్డి, నాగటి నరేష్ తదితరులు పాల్గొన్నారు.
-ప్రజా సంక్షేమం న్యూస్ డెస్క్