రాచమల్ల భద్రయ్య మృతి నాయి బ్రాహ్మణ సంఘానికి తీరని లోటు

భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సీపీఎం నాయకులు ప్రజాసంక్షేమం న్యూస్ రామన్నపేట: మండలంలోని నీర్నేముల గ్రామానికి చెందిన నాయి బ్రాహ్మణ సంఘం మాజీ జిల్లా నాయకులు రాచమల్ల భద్రయ్య అనారోగ్యంతో మృతి చెందడం పట్ల సీపీఎం నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ సర్పంచ్ బోయిన ఆనంద్, మాజీ ఎంపీపీ నాగటి ఉపేందర్...