నీర్నేములలో నవ చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం
నీర్నేముల, నవంబర్ 26 (ప్రజా సంక్షేమం న్యూస్): భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రామన్నపేట మండలం, యాదాద్రి భువనగిరి జిల్లాలోని నీర్నేముల గ్రామంలో నవ చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి, కొవ్వొత్తులు వెలిగించి అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛను కల్పించిందని కొనియాడారు. రాజ్యాంగం అందించిన హక్కులను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, అంబేద్కర్ ఆశయాలను సాధించేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని, సమానత్వం, సామాజిక న్యాయం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం వంటి విలువలను ఆచరణలో పాటించాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నవ చైతన్య యువజన సంఘం నాయకులు, సభ్యులు, గ్రామ యువకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌కు ఘన నివాళులర్పించారు.