రాష్ట్రవ్యాప్తంగా ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములు కావాలి: మంత్రి రైతుల సమక్షంలోనే సమగ్ర భూ సర్వే – భూ వివాదాలకు శాశ్వత పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం మేడ్చల్–మల్కాజిగిరి: రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి పండుగను లబ్ధిదారులతో కలిసి ఘనంగా నిర్వహించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములు కావాలని రాష్ట్ర మంత్రి పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్లు వెల్లడించారు.తొలి విడతలో ప్రజా ప్రభుత్వం మంజూరు చేసిన 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లలో ఇప్పటివరకు 2,21,500 ఇళ్లలో గృహప్రవేశాలు...