రైతుల హక్కుల కోసం ఎర్రజెండా పోరాట వారసత్వాన్ని కాపాడుకోవాలి
కార్పొరేట్ అనుకూల విధానాలతో వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం మహిళా రైతులకు గుర్తింపు, భూసంస్కరణలు అమలు చేయాలి: బృందా కారత్ నల్లగొండ, నవంబర్ 15, ప్రజా సంక్షేమం న్యూస్: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను మతతత్వ రాజకీయాలకు ఆపాదించే ప్రయత్నాలను తిప్పికొట్టాలని మాజీ ఎంపీ, ఐద్వా జాతీయ నాయకురాలు బృందా కారత్ పిలుపునిచ్చారు. రైతులు, వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదల హక్కుల పరిరక్షణ కోసం ఎర్రజెండా నాయకత్వంలో సాగిన పోరాట వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.ఆదివారం నల్లగొండ పట్టణంలోని ఎన్జీ...