రైతు భరోసా పేరిట నకిలీ ఎస్ఎంఎస్లు.. రైతులు అప్రమత్తంగా ఉండాలి
రైతులారా.. అప్రమత్తంగా ఉండండి.. సైబర్ మోసాలకు దూరంగా ప్రజాసంక్షేమం న్యూస్ నల్లగొండ,నవంబర్ 06: రైతు భరోసా పథకం పేరుతో నకిలీ ఎస్ఎంఎస్లు పంపిస్తూ రైతులను మోసం చేసేందుకు సైబర్ నేరగాళ్లు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వ్యవసాయ శాఖ సూచించింది.రాష్ట్రవ్యాప్తంగా సుమారు **2,73,128 మంది రైతులకు నకిలీ సందేశాలు** పంపినట్లు అధికారులు గుర్తించారు. రైతు భరోసా నిధులు ఖాతాల్లో జమయ్యాయని పేర్కొంటూ, సందేశాల్లో ఇచ్చిన లింకులను క్లిక్ చేయాలని సైబర్ నేరగాళ్లు రైతులను ప్రలోభపెడుతున్నారు.ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని పలు గ్రామాల...