లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ మండల వ్యవసాయ అధికారి

ఫర్టిలైజర్ షాపు అనుమతి కోసం లంచం డిమాండ్‌ – కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక దాడి. సదాశివపేట, నవంబర్ 4 (ప్రజా సంక్షేమం న్యూస్): ఫర్టిలైజర్ (ఎరువుల) దుకాణం ఏర్పాటుకు అనుమతి మంజూరు చేసేందుకు లంచం డిమాండ్ చేసిన సదాశివపేట మండల వ్యవసాయ అధికారి (MAO) ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.వివరాల్లోకి వెళితే.. సదాశివపేట మండల పరిధిలో ఫర్టిలైజర్ షాపు ఏర్పాటు చేసేందుకు అవసరమైన అనుమతుల కోసం ఓ వ్యక్తి మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే అనుమతి మంజూరు చేయాలంటే లంచం...