PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 10 November 2026, 7:19 pm Posted by : Praja Sankshemam News

విద్యుత్ సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి: ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు

జహీరాబాద్, నవంబర్ 10 (ప్రజా సంక్షేమం న్యూస్):
జహీరాబాద్ నియోజకవర్గంలో విద్యుత్ సరఫరా, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వ్యవసాయ విద్యుత్ సరఫరా తదితర అంశాలపై విద్యుత్ శాఖ అధికారులతో జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్ రావు మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా రైతులకు వ్యవసాయ అవసరాల కోసం విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.గ్రామాలు, పట్టణాల్లో విద్యుత్ సమస్యలపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, విద్యుత్ అంతరాయాలు ఏర్పడినప్పుడు ఆలస్యం చేయకుండా తక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు.అదేవిధంగా విద్యుత్ ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, పెండింగ్‌లో ఉన్న విద్యుత్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు.ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించడంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే మాణిక్ రావు స్పష్టం చేశారు.