అర్హులైన పేదలందరికీ సొంతింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం
వెల్టూరు,నవంబర్ 16 (ప్రజా సంక్షేమం న్యూస్):
పేదల సొంతింటి కలను సాకారం చేసే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా రెండో విడత నిర్మాణ పనులకు వెల్టూరు గ్రామంలో సోమవారం శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు సంప్రదాయబద్ధంగా ముగ్గు వేసి, భూమిపూజ నిర్వహించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు.అనంతరం నాయకులు మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. లబ్ధిదారులు ప్రభుత్వ సహకారాన్ని సద్వినియోగం చేసుకొని ఇళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, వెల్టూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రిపోర్టర్:ఎండీ ఖాజా మొయినొద్దీన్
సంగారెడ్డి జిల్లా బ్యూరో ఇన్చార్జ్