వెల్టూరులో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ
అర్హులైన పేదలందరికీ సొంతింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం వెల్టూరు,నవంబర్ 16 (ప్రజా సంక్షేమం న్యూస్): పేదల సొంతింటి కలను సాకారం చేసే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా రెండో విడత నిర్మాణ పనులకు వెల్టూరు గ్రామంలో సోమవారం శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు సంప్రదాయబద్ధంగా ముగ్గు వేసి, భూమిపూజ నిర్వహించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు.అనంతరం నాయకులు మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు...