శతవసంతాల విద్యా ప్రదాత చుక్కా రామయ్యకు సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు

హైదరాబాద్, నవంబర్ 20 (ప్రజా సంక్షేమం న్యూస్): ప్రముఖ విద్యావేత్త, తెలంగాణ సమాజానికి విశేష సేవలందించిన చుక్కా రామయ్య 100 సంవత్సరాల జీవిత ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆయన నివాసానికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చుక్కా రామయ్య జన్మదినం తెలంగాణ ప్రజలకు, రాష్ట్ర విద్యా వ్యవస్థకు ఎంతో ప్రత్యేకమైన పర్వదినమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.స్వాతంత్య్ర ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన చుక్కా రామయ్య, విద్యారంగంలో తనదైన చెరగని ముద్ర వేశారని సీఎం కొనియాడారు. విద్యార్థుల్లో...