పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి.. ప్రజలకు నాణ్యమైన పోలీస్ సేవలు అందించాలి
ప్రజాసంక్షేమం న్యూస్ నల్గొండ: జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్, షాలిగౌరారం సర్కిల్ కార్యాలయం, కట్టంగూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి పోలీసుల పనితీరు, రికార్డుల నిర్వహణ, కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల వివరాలను సమీక్షించారు.ఈ సందర్భంగా పెండింగ్ కేసుల దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు సత్వర న్యాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల ఫిర్యాదులను గౌరవంగా స్వీకరించి, నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి నాణ్యమైన పోలీస్ సేవలు అందించాలని సూచించారు.రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలని, అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణా, మాదకద్రవ్యాల నేరాలు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ ఆదేశించారు.పోలీస్ అధికారులు, సిబ్బంది విధుల్లో క్రమశిక్షణ, జవాబుదారీతనం, సమన్వయం పాటిస్తూ ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.ఈ తనిఖీల్లో నల్గొండ డీఎస్పీ కె. శివరాం రెడ్డి, ఇన్స్పెక్టర్లు రాజశేఖర్, హరిబాబు, కేతేపల్లి ఎస్ఐ రవికుమార్, కట్టంగూర్ ఎస్ఐ క్రాంతి కుమార్ తదితర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.